
ఏజ్ డెబ్భై నాలుగు... చిరుతపులిలా పరుగులు... అవినీతిపై పోరాటంలో... ఈ దేశ యువతరానికి... నేతృత్వం వహిస్తున్న అన్నా... ఈ తరానికి నాయకత్వం వహించటంలో... సమర్థుడినే అని నిరూపించుకున్నారు. తీహార్ జైలు నుంచి నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్న అన్నాహజారే... రాజ్‌ఘాట్‌లో ఒక్కసారిగా పరుగులు పెట్టారు... దీక్షలోనే ఉన్నా... తాను అలసిపోలేదని... ఈ దేశం నుంచి అవినీతిని తరిమి తరిమి కొట్టేందుకు... తనలో సత్తా ఉందని... నవయువకుడిలా పరుగు తీసి నిరూపించుకున్నారు.అన్నా ఒక్కసారిగా పరుగు అందుకోవటం గమనించిన పోలీసులు... ఆయనతో సమానంగా పరుగు తీయలేక అవస్థలు పడటం గమనార్హం.
0 comments:
Post a Comment