
వైఎస్ జగన్ శిబిరంలో నిన్నటిదాకా కనిపించిన దూకుడు ఎందుకు మాయమైంది....
సీబీఐ దర్యాప్తు వెఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో టెన్షన్‌ను పెంచుతోందా......
అవినీతికి వ్యతిరేకంగా జగన్ టీమ్ చేసిన స్టేట్‌మెంట్స్‌లో నిజాయితీ ఎంత.....
దివంగత నేత...ప్రియతమ నాయకుడు...వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టైల్‌లో చెప్పాలంటే తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదనేది సామెత.వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఇపుడా సామెత ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది.పొలిటికల్ లీడర్ల వ్యవహారశైలి అవసరానికి అనుగుణంగా ఎలా మారుతుంటుందో మరోమారు నిరూపితమైంది
సీన్ నంబర్ వన్......రాజకీయ అవినీతిపై అంకుశంగా జన్‌లోక్‌పాల్ బిల్లు రూపొందించాలని పోరాడుతున్న అన్నాహజారే తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు.దీక్షాస్థలికి నవయువకుడిలా పరుగులు తీస్తూ అన్నాహజారే ముందడుగేయగానే వేలాదిగా జనం అనుసరించారు. లీడ్‌పార్ట్ జగన్ టీమ్ గురించి చెప్పి....మార్నింగ్ నుంచి గంటగంటకు నిరాటంకంగా చూపిస్తూ వస్తున్న అన్నాహజారే విడుదలను చూపిస్తున్నారేంటని అనుకోకండి....ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది....అదేంటో తెలియాలంటే కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళాలి....
సీన్ నంబర్ టూ.......నాలుగు నెలల క్రితం అన్నాహజారే అవినీతిపై పోరాటానికి శ్రీకారం చుట్టారు.వారూ...వీరూ...అనే తేడా లేకుండా దేశవ్యాపితంగా......అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొలిటికల్ లీడర్స్‌తో సహా అందరూ అన్నాకు మధ్దతు తెలపడంలో పోటీ పడ్డారు.అదే సమయంలో వైఎస్ జగన్ సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అవినీతిపై పోరాటానికి నేను సైతం అంటూ రంగంలోకి దిగారు.సరాసరి అన్నాహజారే దగ్గరికెళ్లి అవినీతిపై పోరాటానికి తన శక్తిమేరకు ఉడతాసాయంగా పదివేల రూపాయల విరాళమిచ్చారు.అన్నా ఆప్ సంఘర్ష్ కరో హమ్ తుమ్హారా సాథ్ హై అంటూ గట్టి భరోసా ఇచ్చి వచ్చారు.
ఇపుడు మళ్ళీ ప్రస్తుతానికొద్దాం........వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత జగన్ బాటలోనే నిన్నటిదాకా మీకు చేతనైంది చేసుకోండంటూ రూలింగ్‌పార్టీకి సవాళ్లు విసిరిన నాయకులు ఒక్కసారిగా రూట్ మార్చారు.హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తుకు దిగడంతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు.ఓవైపుతమ అధినేత జగన్ సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని చెప్తున్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు టెన్షన్‌లోకి వచ్చేశారు.కట్ చేస్తే........అవినీతిపై పోరాటంలోఅన్నాహజారేకుసంఘీభావం తెలిపిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు రెచ్చిపోయారు.
ముందే చెప్పినట్టు తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదన్న విషయం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఇపుడిపుడే అనుభవంలోకి వస్తోంది.కనీసం తాము అవినీతిపరులం కాదని రుజువు చేసుకునేదాకానైనా ఓపిక పట్టలేరా
0 comments:
Post a Comment