
రాష్ట్ర రాజకీయం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది.ప్రత్యేకించి తెలంగాణ అంశాన్ని కేంద్రంగా చేసుకొని గల్లీ నుంచీ ఢిల్లీ దాకా రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకుంటోంది.
ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలంగాణపై హైకమాండ్ సానుకూలంగా వస్తుందనే గంపెడాశతో టీ కాంగ్రెస్ నేతలు కాళ్ళకు రాజీనామాల చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. అటు ఆజాద్,సీఎం మాత్రం,సీమాంధ్ర నేత లగడపాటి మాత్రం రెండునెలల్లో తెలంగాణ వ్యవహారం తేలిపోతుందంటున్నారు......
ఇంతకీ 60 రోజుల్లో ఏం జరుగనుంది?
ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ......
తెలంగాణ కాంగ్రెస్ నేతల షటిల్ పర్యటనలు
ఢిల్లీలో ఉన్నా...ఆంధ్రాలో ఉన్నా చాపకిందనీరులా చక్రం తిప్పుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
ఏ రోటికాడ ఆ పాట పాడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు
సంప్రదింపుల ఎజెండాపై ఎవరివాదన వారిదే.....హైకమాండ్ దారి హైకమాండ్‌దే
పరస్పరం భగ్గున మండిపోతున్న తెలంగాణ,సమైక్యాంధ్ర వాదనలపై కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్‌ఫుల్‌గా సంప్రదింపుల నీళ్లు జల్లింది.
తెలంగాణ కోసం రాజీనామాలన్న టీ కాంగ్రెస్ లీడర్లు...సమైక్యాంధ్ర విషయంలో రాజీ లేదన్న సీమాంధ్ర నేతలు గీత దాటకుండా ఆజాద్‌రేఖను గీశారు. రెండు నెలల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారమంటూ అటు ఆజాద్‌తోపాటు ఇటు సీఎం కిరణ్ కూడా అంటున్నారు....
ఇరుప్రాంత నేతలను చర్చలకు మెంటల్‌గా ప్రిపేర్ చేసిన ఆజాద్ విభిన్నంగా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు....
సంప్రదింపుల ఎజెండా ఏమిటో తెలీకుండానే చర్చలకు హాజరైన టీ కాంగ్రెస్ నేతలతో......రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర నేతలకున్న అభ్యంతరాలేంటని ఆజాద్ ఆరా తీశారు.
ఢిల్లీలో ఏ తలుపు తెరుచుకున్నా...అది తెలంగాణ కోసమే అయి ఉంటుందన్నంత ఆశతో టీ కాంగ్రెస్ నేతలు సైకలాజికల్‌గా ఫిక్సయిపోతున్నారు. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఢిల్లీ చుట్టూ పదే పదే ప్రదక్షిణలు చేయకుండానే ఏం జరగబోతోందో బాహటంగానే చెప్పుకుంటున్నారు.
విడిపోవాలంటే సీమాంధ్రులు ససేమిరా అంటుంటే.....కలిసి ఉండడం ఇకపై కలలో మాటేనంటున్నారు తెలంగాణ నేతలు.కాంగ్రెస్ హైకమాండ్‌కు మాత్రం తెలంగాణలోని 17,సీమాంధ్రలోని 25 లోక్‌సభస్థానాలు కనిపిస్తున్నాయనే వాదన ప్రముఖంగా ప్రస్తావనకొస్తోంది.కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 12 స్థానాలు,సీమాంధ్రలో దీనికి అదనంగా తొమ్మిది స్థానాలతో 21 మంది ఎంపీలున్నారు.రాహూల్‌గాంధీని ప్రధానిని చేయడానికి ఒక్కొక్క ఎంపీనీ అపురూపంగా లెక్కేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మొగ్గు ఎటు ఉంటుందనేది ఆసక్తిని రేపుతోంది.
: సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మాటల్లో ఈ లెక్కల ధీమానే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆకాశమంత ఎగిసిన తెలంగాణ ప్రజల మనోభావాలనే హైకమాండ్ గౌరవిస్తుందనే నమ్మకం టీ కాంగ్రెస్ నేతలది.
0 comments:
Post a Comment